News December 28, 2024

NEW YEAR: HYDలో 31ST NIGHT ఆంక్షలు

image

➤ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
➤ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బంద్
➤మిడ్‌నైట్ 12:30 వరకు వేడుకలకు అనుమతి
➤పార్టీల్లో మైనర్లకు నో ఎంట్రీ
➤ఇండోర్‌‌‌‌‌‌‌‌లోనే మ్యూజికల్ ఈవెంట్స్
➤సౌండ్ పొల్యూషన్ 45 డెసిబుల్స్‌‌‌‌ దాటొద్దు
➤అసభ్యకర డాన్సులు బ్యాన్
➤మైనర్లకు వాహనాలు ఇస్తే ఓనర్‌దే బాధ్యత
➤డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌లో పట్టుబడితే రూ.10,000 FINE, 6 నెలల జైలు శిక్ష
SHARE IT

Similar News

News January 20, 2025

సందర్శకులతో కిక్కిరిసిన నాంపల్లి నుమాయిష్‌

image

నాంపల్లి ఎగ్జిబిషన్‌ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసింది. ఒక్కరోజే 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడించారు. వివిధ స్టాళ్ల వద్ద తమకు నచ్చినవి కొనుగోలు చేస్తూ పిల్లలతో సరదాగా గడిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఆసక్తి కనబరిచారు. 

News January 20, 2025

కేజ్రీవాల్‌పై అంబర్‌పేట్ వాసి పోటీ..!

image

HYD అంబర్‌పేట్ వాసి దుగ్గిరాల నాగేశ్వరరావు న్యూఢిల్లీ 40వ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ జనసేన పార్టీ తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన నాగేశ్వరరావు అంబర్‌పేట్‌లో ఉంటున్నారు. తన పార్టీ గుర్తు గ్రీన్ చిల్లి అని తెలిపారు. ఇటీవల ఆయన వయనాడ్‌లో ప్రియాంకా గాంధీపై పోటీ చేశారు.

News January 20, 2025

HYD స్విమ్మర్ సరికొత్త రికార్డు

image

HYD కాచిగూడకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. డిగ్రీ చదువుతున్న తన కుమారుడు స్టీఫెన్ కుమార్(20)తో కలిసి ఆదివారం అరేబియా సముద్రంలోని మండ్వాజెట్ నుంచి ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి చరిత్ర సృష్టించారు. తల్లీకుమారుడు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి.