News December 25, 2024
NEW YEAR: HYDలో 10 దాటితే బంద్!

రాజధానిలోని 3 కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
➤ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బంద్
➤ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
➤మైనర్లకు పార్టీల్లో నో ఎంట్రీ
➤ఇండోర్‌లోనే మ్యూజికల్ ఈవెంట్స్
➤సౌండ్ పొల్యూషన్ 45 డెసిబుల్స్ దాటొద్దు
➤అసభ్యకర డాన్సులు బ్యాన్
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 FINE, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.
SHARE IT
Similar News
News November 8, 2025
హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 8, 2025
జూబ్లీ బైపోల్: చనిపోయిన ఓటర్ల వివరాల సేకరణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి వివిధ పార్టీల కార్యకర్తలు మరణించిన ఓటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎంతమంది మరణించారు.. ఎంతమందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి అనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ రోజు ఎవరైనా మృతి చెందిన ఓటరు పేరున వచ్చి ఓటు వేసే ప్రమాదముండటంతో ముందుజాగ్రత్త చర్యగా.. పోలింగ్ కేంద్రంలో అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
News November 8, 2025
సికింద్రాబాద్: బెర్తులు ఖాళీ.. బుక్ చేసుకోండి!

సిటీ నుంచి వెళ్లే పలు రైళ్లకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.. బుక్ చేసుకోండి అంటూ స్వయంగా రైల్వే అధికారులే చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి, చర్లపల్లి నుంచి దానాపూర్, విశాఖపట్టణం, కాకినాడ, ధర్మవరం, తిరుచానూరు, నర్సాపూర్, కాచిగూడ నుంచి తిరుచానూరుకు వెళ్లే రైళ్లల్లో బెర్తులు నేటి నుంచి 13 వరకు ఖాళీలున్నాయని CPRO శ్రీధర్ తెలిపారు. మరెందుకాలస్యం.. ప్రయాణాలుంటే బుక్ చేసుకోండి మరి.


