News December 31, 2024
న్యూఇయర్ ఆఫర్స్: ₹7కే 3GB డేటా

యూజర్ల కోసం BSNL 2 కొత్త ఆఫర్లు ప్రకటించింది. మొదటిది రూ.628 ప్లాన్. వ్యాలిడిటీ 84 రోజులు. మొత్తం 252GB డేటా వస్తుంది. రోజుకు 3GB వాడుకోవచ్చు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ రూ.7 మాత్రమే. అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, గేమ్స్, పాడ్కాస్ట్, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్టైన్మెంట్ లభిస్తాయి. ఇక రూ.215 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. మొత్తం 60GB డేటా వస్తుంది. రోజుకు 2GB వాడుకోవచ్చు. పై ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.
Similar News
News October 26, 2025
వరల్డ్ కప్ ఆడటమే రోహిత్ లక్ష్యం: కోచ్

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రచారాన్ని అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కొట్టిపారేశారు. హిట్మ్యాన్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పారు. 2027 వరల్డ్ కప్ వరకు ఆడటమే రోహిత్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ తర్వాతే రిటైర్ అవ్వాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. మరోవైపు AUSలో చివరి మ్యాచ్ ఆడేశానంటూ రోహిత్ SMలో పోస్ట్ చేశారు. ‘వన్ లాస్ట్ టైమ్.. సైనింగ్ ఆఫ్ ఫ్రం సిడ్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు.
News October 26, 2025
ఇతిహాసాలు క్విజ్ – 47 సమాధానాలు

1. దశరథ మహారాజు కుల గురువు ‘వశిష్ఠుడు’.
2. ఉలూచి, అర్జునుల కుమారుడు ‘ఇరావంతుడు’.
3. దేవతల తల్లి ‘అధితి’.
4. శివుడు నర్తించే రూపం పేరు ‘నటరాజ’.
5. సత్య హరిశ్చంద్రుడి భార్య పేరు ‘చంద్రమతి’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 26, 2025
మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం: మహేశ్ గౌడ్

TG: DCCల నియామకంపై తమ అభిప్రాయాలు తీసుకున్నట్లు PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చిట్చాట్లో తెలిపారు. ‘మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం. కొండా సురేఖ విషయంలో CM రేవంత్ సమస్యను సానుకూలంగా పరిష్కరించారు. మేం ఎప్పుడూ హైకమాండ్ రాడార్లోనే ఉంటాం. మంత్రుల వివాదంపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చాం. ఎంత పెద్దవాళ్లు అయినా పార్టీకి లోబడే పనిచేయాలి. జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.


