News January 1, 2025
న్యూ ఇయర్.. పోలీసుల WARNING

న్యూ ఇయర్ వేడుకల వేళ TG పోలీసులు ప్రజలను వెరైటీగా హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, డ్రగ్స్ వాడినా జైలుపాలవ్వక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ‘మీ కోసం జైల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెడీ. ప్రత్యేక ఆహ్వానితులు.. తాగి వాహనం నడిపేవాళ్లు, రోడ్లపై స్టంట్లు చేసేవాళ్లు, రోడ్లపై అల్లరి చేసేవాళ్లు’ అని తెలిపారు. ముఖ్య అతిథులు డ్రగ్స్ సేవించే వ్యక్తులు అని, మీ కోసం బేడీలతో రెడీగా ఉన్నామని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
తాడేపల్లి: వర్ల రామయ్యపై YCP నేతల ఫిర్యాదు

టీడీపీ నేత వర్ల రామయ్యపై వైసీపీ SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఇటీవల YS జగన్ ACB కోర్టుకు వెళ్లిన సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఓ అభిమాని చూపిన ప్లకార్డును గురించి వర్ల ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అభిమానుల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా చూపుతున్నారని విమర్శించారు.
News November 23, 2025
ఏపీ టెట్.. కొన్ని గంటలే గడువు

AP TET దరఖాస్తులకు కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇవాళ 11.59PMలోపు అప్లై చేసుకోవాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు 2L మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 3న హాల్టికెట్లు విడుదలవుతాయి. DEC 10 నుంచి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. JAN 19న ఫలితాలు వెల్లడిస్తారు.
వెబ్సైట్: https://cse.ap.gov.in/
News November 23, 2025
వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

ఆసీస్తో ODI సిరీస్లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


