News December 31, 2024
న్యూఇయర్ విషెస్.. జాగ్రత్త సుమా: పోలీసులు

కొత్త ఏడాదిని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు, డిస్కౌంట్ కూపన్లు, ఆఫర్ కూపన్లు, ఫ్రీ ఈవెంట్ పాస్లు, APK ఫైల్స్ వంటివి పంపి మీ సమాచారాన్ని హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. లింక్లు క్లిక్ చేయమని కోరే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇలాంటి వాటిపై <
Similar News
News November 22, 2025
ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు ఇస్తాం: మంత్రి తుమ్మల

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లోపు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ప్రతి మహిళకు వద్దకు వెళ్లి, బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరలను అందించాలని సూచించారు.
News November 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 74

ఈరోజు ప్రశ్న: వేంకటేశ్వరస్వామి ద్వార పలుకులు అయిన జయవిజయులు తర్వాతి మూడు జన్మలలో అసురులుగా ఎందుకు జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 22, 2025
26న ‘స్టూడెంట్ అసెంబ్లీ’.. వీక్షించనున్న సీఎం

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కొందరు స్పీకర్, Dy.స్పీకర్, CM, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని CM CBN, మంత్రులు వీక్షించనున్నారు.


