News August 11, 2024

హైదరాబాద్‌లో ‘న్యూయార్క్ సెంట్రల్ పార్క్’

image

TG: న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్‌లో రాజీవ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని CM రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనువైన ప్రాంతం, స్థలం కోసం అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ పార్క్‌ను 4100 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. పార్క్ చుట్టూ బిలియనీర్లు, ప్రముఖులు, కార్పొరేట్ ఆఫీస్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా న్యూయార్క్ సెంట్రల్ పార్క్ 843 ఎకరాల్లో విస్తరించి ఉంది.

Similar News

News January 18, 2025

మరో 63 అన్న క్యాంటీన్లు

image

AP: రాష్ట్రంలో కొత్తగా 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటి ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవనున్నారు. ఏ ప్రాంతాల్లో ప్రారంభిస్తారనే విషయమై ఈ నెలఖారులోగా క్లారిటీ వచ్చే అవకాశముంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించగా ప్రస్తుతం 203 అందుబాటులో ఉన్నాయి.

News January 18, 2025

నేడు విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్

image

దేశవాళీ వన్డే ట్రోఫీ విజయ్ హజారే ఫైనల్ నేడు విదర్భ, కర్ణాటక జట్ల మధ్య జరగనుంది. విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ భీకర ఫామ్‌లో ఉండగా ఆ జట్టు తొలిసారి టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఐదో సారి VHTని ఖాతాలో వేసుకోవాలని మయాంక్ సారథ్యంలోని కర్ణాటక చూస్తోంది. మ.1.30కు మ్యాచ్ ప్రారంభం కానుండగా జియో యాప్, స్పోర్ట్ 18 ఛానల్‌లో లైవ్ చూడవచ్చు.

News January 18, 2025

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్

image

AP: నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2020 తర్వాత ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. తిరుపతి(D) సుళ్లూరుపేటలోని నేలపట్టు, అటకానితిప్ప, బీవీ పాలెం, శ్రీసిటీ ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ జరగనుంది. 3 రోజుల్లో 5-6 లక్షల మంది పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.