News June 14, 2024
న్యూయార్క్ పిచ్‌లు రంజీ పిచ్‌లలా ఉన్నాయి: దూబే

టీ20 వరల్డ్ కప్ పలు మ్యాచ్‌లు అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి పిచ్‌లపై స్కోరు కొట్టేందుకు అన్ని జట్లూ చాలా ఇబ్బంది పడ్డాయి. దీనిపై టీమ్ ఇండియా ఆటగాడు శివమ్ దూబే స్పందించారు. ‘ఆ పిచ్‌లపై సిక్స్ కొట్టడం చాలా కష్టం. సిక్స్ కొట్టాలంటే సరైన అవకాశం కోసం వేచి చూడాల్సిందే. టైం తీసుకోవాల్సిందే. నాకైతే రంజీ ట్రోఫీ ఆడుతున్నట్లుగా అనిపించింది’ అని వివరించారు.
Similar News
News January 21, 2026
దావోస్‌లో కేటుగాళ్లు.. బిలియనీర్లకే బురిడీ

దావోస్‌లో కేటుగాళ్లు మాటువేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో బిలియనీర్లను బురిడీ కొట్టిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు ‘USA హౌస్’లోకి వీఐపీ యాక్సెస్ కల్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు స్కామర్లు నకిలీ టికెట్లను విక్రయించడం గమనార్హం. ఈ విషయం బయటపడటంతో జాగ్రత్తగా ఉండాలంటూ బిలియనీర్లను USA హౌస్ హెచ్చరించింది. ‘మోసపోయిన వారికి మా సానుభూతి’ అంటూ పేర్కొంది.
News January 21, 2026
రెహమాన్ గొప్ప కంపోజర్, మంచి వ్యక్తి: RGV

‘జయహో’ పాట విషయంలో ఏఆర్ రెహమాన్‌పై తన <<18913562>>వ్యాఖ్యలను<<>> తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. తన దృష్టిలో రెహమాన్ గొప్ప కంపోజర్ అని, తాను కలిసినవారిలోకెల్లా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ఇతరుల క్రెడిట్ తీసుకునేవారిలో చివర ఉండేది ఆయనేనని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఇప్పటికైనా నెగటివ్ ప్రచారానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నట్లు Xలో రాసుకొచ్చారు.
News January 21, 2026
కేరళలో పాగా వేయడం BJPకి సాధ్యమేనా?

తిరువనంతపురం మేయర్ స్థానాన్ని గెల్చుకున్న BJP అదే ఊపుతో APRలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఎన్నికల బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు అప్పగించింది. ప్రభుత్వ స్థాపనే లక్ష్యమని హోమ్ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే బిహార్‌లా కేరళలో అధికారం అంత ఈజీ కాదని, BJP ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగినా చాలా సవాళ్లు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. LDF, UDF బలంగా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.


