News December 19, 2024
ఆర్థిక మాంద్యంలోకి న్యూజిలాండ్!

న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3వ క్వార్టర్లో మాంద్యానికి లోనైంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాలకంటే తగ్గడంతో NZ డాలర్ విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ 2024 Sep త్రైమాసికంలో 1% తగ్గింది. ఇది మార్కెట్ అంచనాలైన 0.2% తగ్గుదలకంటే అధికం. అలాగే జూన్ క్వార్టర్ 1.1% క్షీణతతో కలిపితే సాంకేతికంగా మాంద్యాన్ని సూచిస్తుంది. దీంతో కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల కోత విధించవచ్చు.
Similar News
News December 2, 2025
జగిత్యాల: ఎన్నికల విధులపై సూక్ష్మ పరిశీలకులకు మార్గనిర్దేశం

జగిత్యాల కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.రమేష్ మాట్లాడుతూ.. సూక్ష్మ పరిశీలకుల పాత్ర పోలింగ్‌లో కీలకమని అన్నారు. సాధారణ పరిశీలకుడి ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించారు. మాక్ పోలింగ్, ఓటర్ల గుర్తింపు, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాలన్నారు.
News December 2, 2025
మళ్లీ వేలంలోకి ‘HR88B8888’.. ఎందుకంటే?

హరియాణాలో ‘HR88B8888’ అనే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వేలంలో రూ.1.17 కోట్లు పలికి దేశవ్యాప్త చర్చకు దారితీసిన <<18396670>>విషయం<<>> తెలిసిందే. ఈ నంబర్‌ను తిరిగి వేలం వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 50,000 కనీస ధరతో ప్రారంభమైన గత ఆన్లైన్ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. అయితే ఈ నంబర్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి నిర్ణీత గడువులో డబ్బు చెల్లించలేదు. దీంతో మళ్లీ వేలంపాట నిర్వహిస్తున్నారు.
News December 1, 2025
చలికాలం స్వెటరు వేసుకుని పడుకుంటున్నారా?

చలికాలం కొందరు స్వెటరు వేసుకుని పడుకుంటారు. అయితే దానికి బదులు కాటన్, లెనిన్, బ్రీతబుల్ దుస్తులు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ‘స్వెటరే వేసుకోవాలి అనుకుంటే టైట్‌గా ఉండేది వద్దు. దాంతో బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరగదు. కాస్త లూజ్‌గా, పొడిగా, బ్రీతబుల్, శుభ్రంగా ఉండేది వేసుకోండి. వింటర్లో కాళ్లకు సాక్సులు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అవి కూడా శుభ్రంగా, కాస్త లూజ్‌గా ఉండాలి’ అని చెబుతున్నారు.


