News October 26, 2024

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

image

భారత పర్యటనకు ముందు శ్రీలంక చేతిలో పరాజయం. కీలక ప్లేయర్, కెప్టెన్ విలియమ్సన్ గాయంతో దూరమయ్యారు. దీంతో NZపై భారత్ సులభంగా సిరీస్ గెలిచేస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ కివీస్ క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. తొలి టెస్టులో పేస్‌తో దెబ్బకొట్టి, రెండో టెస్టులో స్పిన్‌తో భారత ప్లేయర్లను అల్లాడించారు. 1955 తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించారు.

Similar News

News October 16, 2025

ఆమెకు 1400 మరణశిక్షలు విధించాలి!

image

బంగ్లా మాజీ PM షేక్ హసీనాకు 1,400 మరణశిక్షలు విధించాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో ఆ దేశ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ వాదించారు. కనీసం ఒక్క మరణశిక్షైనా విధించకపోతే అన్యాయమేనన్నారు. అక్కడ గతేడాది JUL-AUGలో జరిగిన అల్లర్లలో 1400 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాలకు హసీనే కారణమని బంగ్లా ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

News October 16, 2025

WWC25: సెమీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా

image

ఉమెన్స్ ODI WC-2025లో సెమీ ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత BAN 198/9 స్కోర్ చేయగా, AUS 24.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. అలీసా హీలీ(113) సెంచరీతో మెరిశారు. లిచ్‌ఫీల్డ్(84) హాఫ్ సెంచరీ చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో హీలీ 20 ఫోర్లు బాదడం విశేషం. కాగా భారత్‌పై మ్యాచులోనూ హీలీ(142) అద్భుత సెంచరీ చేశారు.

News October 16, 2025

8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

image

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్‌ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.