News November 11, 2024
ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ గెలుపు

శ్రీలంకతో 2వ టీ20లో న్యూజిలాండ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 19.3 ఓవర్లలో 108 రన్స్ చేసి ఆలౌటైంది. 109 రన్స్ లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 103 రన్స్ వద్ద కుప్పకూలింది. దీంతో కివీస్ 5 రన్స్ తేడాతో గెలుపొందింది. చివరి 6 బంతుల్లో 8 రన్స్ కాపాడుకోవాల్సిన దశలో న్యూజిలాండ్ బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ 2 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు. ఫస్ట్ T20లో శ్రీలంక గెలిచింది.
Similar News
News February 4, 2026
మమత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఈసీకి నోటీసులు

బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ కోసం భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రక్రియ వల్ల లక్షలాది మంది ఓటర్ల హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ CM మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ECIకి నోటీసులిచ్చింది. ముఖ్యమంత్రే స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఒక సిట్టింగ్ సీఎం ఇలా నేరుగా కోర్టులో వాదించడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి.
News February 4, 2026
రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.
News February 4, 2026
SBIలో 2,273 ఉద్యోగాలు

SBIలో 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 21-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in


