News April 28, 2024
పాక్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి.. సిరీస్ సమం

పాకిస్థాన్తో జరిగిన ఐదో టీ20లో న్యూజిలాండ్ 9 పరుగులతో తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్.. బాబర్(69), ఫఖర్(43) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. చేధనలో సీఫర్ట్(52), క్లార్క్సన్(38) రాణించినప్పటికీ NZ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దీంతో 2-2 తేడాతో సిరీస్ సమమైంది. మొత్తం ఐదు టీ20ల్లో ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
Similar News
News November 27, 2025
మైఖేల్ వాన్కు వసీం జాఫర్ కౌంటర్

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. SAతో టెస్టు సిరీస్ను భారత్ కోల్పోవడంపై “డోంట్ వర్రీ వసీం, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు”అని వాన్ అన్నారు. దీనిపై స్పందించిన జాఫర్..”నా బాధ త్వరలో తీరిపోతుంది. కానీ నువ్వు మరో 4 టెస్టులు భరించాలి”అని యాషెస్ సిరీస్ మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
News November 26, 2025
రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.
News November 26, 2025
భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్.. హాజరైన సీఎం

TG: హైదరాబాద్లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.


