News December 17, 2024

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ భారీ విజయం

image

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ 423 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన NZ తొలి ఇన్నింగ్సులో 347 పరుగులు చేయగా ENG 143 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో న్యూజిలాండ్ 453 పరుగులు చేయగా ఇంగ్లండ్ 234 పరుగులకే ఆలౌటైంది. కాగా మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకోవడం గమనార్హం. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా హ్యారీ బ్రూక్, POTMగా సాంట్నర్ నిలిచారు.

Similar News

News November 26, 2025

₹7,280 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ పథకం

image

రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ ఎగుమతులపై చైనా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏటా 6K మెట్రిక్ టన్నుల సామర్థ్యమే లక్ష్యంగా ₹7,280 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. గ్లోబల్ బిడ్డింగ్‌తో 5 సంస్థలను ఎంపిక చేస్తామని, ఒక్కో సంస్థకు 1,200 MTPA సామర్థ్యం నిర్దేశిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

News November 26, 2025

చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

image

భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా బావమరిది జీత్ పబారీ ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఉరేసుకున్నారు. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పబారీపై గతేడాది అత్యాచారం కేసు పెట్టింది. అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉండగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పుజారా భార్య పూజ సోదరుడే జీత్ పబారీ.