News September 1, 2025
కొత్తగా పెళ్లైందా.. ఇవి పాటించండి!

కొత్త దంపతులు ఎక్కువగా మాట్లాడుకుంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫోన్లు, టీవీ పక్కనపెట్టి కాసేపు భవిష్యత్ లక్ష్యాల గురించి చర్చించుకోవాలి. నచ్చిన వంట చేసుకుని కలిసి తినాలి. పనుల్లో ఒకరికొకరు సాయంగా నిలవాలి. కోపాన్ని పక్కనపెట్టి సహనంతో సమస్యలను పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. శృంగారంలో పరస్పర ఇష్టాలను గౌరవించుకోవాలి’ అని చెబుతున్నారు.
Similar News
News September 4, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

AP: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేందుకు అవకాశముందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News September 4, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. వీటిపై కీలక చర్చ

AP: CM చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ భేటీ కానుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన SIPB, CRDA సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనుంది. రాజధానిలో భూసేకరణ జరిపేందుకు CRDAకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేయనుంది. రూ.53వేల కోట్ల పెట్టుబడులు, 83వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. అలాగే ఈనెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై చర్చించనుంది.
News September 4, 2025
బెట్టింగ్, లాటరీ, IPL.. వీటిపై GST ఎంతంటే?

బెట్టింగ్, క్యాసినో, గ్యాంబ్లింగ్, హార్స్ రైడింగ్, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై కేంద్రం 40% GST విధించింది. అలాగే IPL వంటి స్పోర్టింగ్ ఈవెంట్స్‌నూ 40% శ్లాబ్‌లో చేర్చింది. అయితే గుర్తింపు పొందిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఈ శ్లాబ్ పరిధిలోకి రావని చెప్పింది. వీటితో పాటు ఇతర క్రీడా కార్యక్రమాల టికెట్ ధర రూ.500 మించకుంటే జీఎస్టీ వర్తించదని తెలిపింది. అంతకు మించితే 18% ట్యాక్స్ కొనసాగుతుందని పేర్కొంది.