News July 1, 2024
పార్టీ మార్పు వార్తలు అవాస్తవం: సబితా ఇంద్రారెడ్డి

TG: తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు KCR సముచిత స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.
Similar News
News December 31, 2025
అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం ఇదే: సీఎం

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్న వారికి సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ‘కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ.. ఒక రోజు ముందుగానే పెన్షన్ సొమ్ము అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లపై రూ.50 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టాం. ఇది మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని తెలియజేస్తూ… అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
News December 31, 2025
రేపు పబ్లిక్ హాలిడే లేదు.. అయినా..

జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు. ఏపీ, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది. అయినా చాలా వరకు ప్రైవేట్ స్కూళ్లు రేపు సెలవు ప్రకటించాయి. దీనికి బదులు ఫిబ్రవరిలో రెండో శనివారం పాఠశాలలు పని చేస్తాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. అటు బ్యాంకులకు సైతం రేపు సెలవు లేదు. యథావిధిగా నడుస్తాయి.
News December 31, 2025
పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. 22 మరణాలు

APలో <<18469690>>స్క్రబ్ టైఫస్<<>> కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 2 వేలకుపైగా కేసులు నమోదు కాగా 22మంది మరణించారు. గత మూడేళ్లుగా చిత్తూరు(D)లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది చిత్తూరులో అత్యధికంగా 491 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, విశాఖ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శరీరంపై నల్లమచ్చతోపాటు జ్వరం, తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.


