News November 22, 2024
రెహమాన్, మోహిని డేపై వార్తలు అవాస్తవం: లాయర్
AR రెహమాన్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన వద్ద పని చేసే మోహిని డే తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందా అంటూ ప్రచారం నడిచింది. ఆ వార్తల్ని రెహమాన్ భార్య తరఫు లాయర్ వందన షా ఖండించారు. ‘ఒకే సమయానికి వేర్వేరు వ్యక్తులు విడిపోతుంటే? రెండింటికీ లంకె పెట్టేస్తారా? ఇలాంటి చెత్త రాతల్ని నేనెప్పుడూ చదవలేదు. అవి అవాస్తవం’ అని తేల్చిచెప్పారు.
Similar News
News November 22, 2024
వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 9 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం నుంచి పది రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని CM రేవంత్ ఆవిష్కరించనున్నారు. DEC 7 నాటికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఆలోగా క్యాబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
News November 22, 2024
ఉద్యోగాలను ఏఐ ఇప్పట్లో భర్తీ చేయలేదు: గూగుల్ రీసర్చ్ హెడ్
టెక్ ఇండస్ట్రీలో AI వినియోగం పెరగడంపై గూగుల్ రీసర్చ్ హెడ్ యోస్సీ మాటియాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యూమన్ డెవలపర్లను ఇప్పట్లో AI భర్తీ చేయలేదని అన్నారు. కోడింగ్ నేర్చుకోవడం ఇప్పటికీ ముఖ్యమేనని పేర్కొన్నారు. కొన్ని టాస్క్‌లలో AI టూల్స్‌ను వినియోగిస్తున్నప్పటికీ, హ్యూమన్ కోడర్‌లకు AI ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. AI- రూపొందించిన కోడ్‌కు హ్యూమన్ రివ్యూ, వాలిడేషన్ అవసరం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 22, 2024
పాక్‌లోకి త్వరలో చైనా సైన్యం.. ఎందుకంటే?
పాక్‌లో ఉంటున్న తమ దేశస్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం చైనా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు ప్రైవేట్ కంపెనీలను నియమించుకుంది. అలాగే తమ సైన్యాన్ని కూడా పాక్‌లో మోహరించాలని యోచిస్తోంది. CPEC ప్రాజెక్ట్స్ కోసం దాదాపు 30వేల మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు అక్కడ ఉంటున్నారు. వారి భద్రతపై చైనా ఆందోళన చెందడంతో పాక్ సర్కార్ కూడా రక్షణ రంగానికి నిధులను పెంచింది.