News April 2, 2025

కొత్త వైరస్ వల్ల దగ్గితే రక్తం అంటూ వార్తలు.. క్లారిటీ!

image

కరోనా గుర్తులు చెరిగిపోక ముందే రష్యాలో కొత్త వైరస్ కలవరపెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వైరస్ వల్ల దగ్గితే రక్తం వస్తోందనే వదంతులూ వ్యాప్తి చెందాయి. ఈ వార్తలను ఆ దేశ అధికారులు కొట్టి పారేశారు. ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందలేదని, అది సాధారణ శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ అని స్పష్టం చేశారు. అయితే, కొందరు తాము జ్వరం, దగ్గుతో బాధపడుతున్నామని చెబుతూ టెలిగ్రామ్‌లో వీడియోలు షేర్ చేసినట్లు సమాచారం.

Similar News

News November 21, 2025

విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

image

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్‌ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్‌ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్‌ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.

News November 21, 2025

హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

image

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.

News November 21, 2025

RRB-NTPC ఫలితాలు విడుదల

image

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.