News December 4, 2024

మందుబాబులకు అదిరిపోయే న్యూస్

image

TG: రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు, పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు రూ.20 చొప్పున, ఇతర మద్యం ధరలు రూ.30-40 చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది.

Similar News

News November 7, 2025

TODAY TOP STORIES

image

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్‌కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్‌పై భారత్ విక్టరీ.. సిరీస్‌లో 2-1 లీడ్

News November 7, 2025

మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

image

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్‌పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

News November 7, 2025

మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

image

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్‌మెంట్‌ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.