News December 5, 2024

నెక్స్ట్ పుష్ప-3.. టైటిల్ ఇదే

image

పుష్ప-2 క్లైమాక్స్‌లో డైరెక్టర్ సుకుమార్ పార్ట్-3కి లింక్ వదిలారు. చివర్లో పుష్ప-3 ర్యాంపేజ్ అనే టైటిల్‌తో సినిమా ముగుస్తుంది. పుష్ప-2లో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మాఫియాను అంతగా చూపించని సుక్కు.. పార్ట్-3లో రివీల్ చేస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? విలన్ ఎవరు? లాంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News March 26, 2026

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.

News March 26, 2026

రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

image

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 26, 2026

BREAKING: పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.