News November 19, 2024
NEXT STEPS: చైనా ఫారిన్ మినిస్టర్‌తో జైశంకర్ మీటింగ్

చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీతో EAM జైశంకర్ సమావేశమయ్యారు. జీ20 సమ్మిట్ జరుగుతున్న బ్రెజిల్ రాజధాని రియోలో ప్రత్యేకంగా కలిశారు. లద్దాక్‌లో సైనిక ఉపసంహరణ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు తీసుకోవాల్సిన తర్వాతి చర్యలపై వీరు చర్చించారు. అలాగే ప్రపంచ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. కొన్ని రోజుల క్రితమే రష్యాలో బ్రిక్స్ సమావేశాల్లో చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ను PM మోదీ ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.
Similar News
News January 1, 2026
DPR లేని ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు చెల్లించారు: రేవంత్

TG: పార్టీని బతికించుకునేందుకు KCR మళ్లీ చంద్రబాబు పేరును, నీటి సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని CM రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడారు. పాలమూరు-RR ప్రాజెక్టుకు KCR ఏడేళ్లు DPR సమర్పించలేదన్నారు. దీంతో పర్యావరణ అనుమతులు రాలేదని, అనుమతులు లేని ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ కొందరు కేసులు వేశారన్నారు. DPR లేని ప్రాజెక్టుకు కమీషన్ల కోసం KCR రూ.27వేల Cr చెల్లించారని విమర్శించారు.
News January 1, 2026
FASTag: ఫిబ్రవరి 1 నుంచి KYV తొలగింపు

ఫాస్టాగ్ జారీలో జాప్యం లేకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. లైట్ వెయిట్ వెహికల్స్ అయిన కార్లు, జీపులు, వ్యాన్లకు నో యువర్ వెహికల్(KYV) ప్రాసెస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి FEB 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. సరైన పత్రాలున్నప్పటికీ ఫాస్టాగ్ యాక్టివేషన్లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాహనదారులకు దీని ద్వారా ఊరట లభించనుంది.
News January 1, 2026
హెల్మెట్‌కు పాలస్తీనా జెండా.. JK11 ప్లేయర్ అరెస్ట్

పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ పెట్టుకుని డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ఆడిన JK11 టీమ్ ప్లేయర్ ఫుర్కాన్ భట్‌ను జమ్మూ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ & కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా జమ్మూ ట్రయల్ బ్లేజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లీగ్ నిర్వాహకుడు జహీద్ భట్‌ను కూడా విచారించనున్నారు.


