News August 17, 2025
NFBS అమలులో జనగామ రెండో స్థానం: కలెక్టర్

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) అమలులో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కుటుంబ పెద్ద మరణించినా, పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని, ఇప్పటి వరకు 880 మంది లబ్ధిదారులకు రూ.1.76 కోట్లు జమయ్యాయని తెలిపారు. కాగా ఈ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన అవసరమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరారు.
Similar News
News August 17, 2025
సంగారెడ్డి: ఈనెల 19న ఇంటర్వ్యూలు

సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 19న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రకాశ్ రావ్ తెలిపారు. కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌లు, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
News August 17, 2025
షార్ట్ ఫిల్మ్స్ కింగ్‌డమ్ కరీంనగర్..!

కరీంనగర్ షార్ట్ ఫిల్మ్స్‌కు హబ్‌గా మారింది. ఇక్కడి కళాకారులు తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన చిత్రాలను నిర్మిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ యాస, భాషకు ప్రాణం పోస్తూ గ్రామీణ నేపథ్య కథలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. రోజుకు 3-5 చిత్రాలు, నెలకు 150 షార్ట్ ఫిల్మ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. పలువురు నటులు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నారు.
News August 17, 2025
సంగారెడ్డి: 20 నుంచి మండల స్థాయి పోటీలు: డీఈఓ

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి పది రోజుల పాటు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.