News March 18, 2025
NGKL: ‘అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
Similar News
News April 17, 2025
కేంద్ర హోంమంత్రి చేతులు మీదుగా పురస్కారం అందజేత

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే పరేడ్ గురువారం మద్యప్రదేశ్‌లో జరిగింది. ఈ వేడుకలలో విశాఖకు చెందిన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరాధ్యుల శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు లభించింది. ఈ అవార్డును శ్రీనివాస్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందజేశారు. 34 ఏళ్లకు పైగా దేశ భద్రతకు ఆయన చేసిన సేవలకి గాను ఈ పురస్కారం లభించింది.
News April 17, 2025
ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సాయంత్రం ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి జోషికి నంద్యాల, కర్నూలు ఎంపీలు బైరెడ్డి శబరి, నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీజీ వెంకటేష్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. పిన్నాపురంలోని గ్రీన్ కో ప్రాజెక్ట్, అహోబిలంలో ఆయన పర్యటించనున్నారు.
News April 17, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించండి: కలెక్టర్

జిల్లాలో బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్కడే విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులు, మండల, నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ఎంఈఓలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆర్డీవోతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.