News January 29, 2025
NGKL: అంబేడ్కర్ యూనివర్సిటీ పరీక్షల ఫీజు చెల్లించండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ విద్యార్థుల 1,3, 5 సెమిస్టర్స్ పరీక్షల ఫీజు చెల్లించాలని జిల్లా రీజినల్ కో -ఆర్డినేటర్ జి.సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. www.braouonline.ac.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్ష ఫీజు జనవరి 2025 30వ తేదీ లోపల చెల్లించాలని కోరారు.
Similar News
News February 15, 2025
కొండ్రావుపల్లి: భార్యాభర్తలపై దాడి

కొండ్రావుపల్లిలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. అందులో భార్యభర్తలకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పొలంలో అదే గ్రామానికి చెందిన అర్జున్‌రావు గేదె వచ్చి మేస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్జున్‌రావు, అతడి కుమారుడు బాబురావు వచ్చి శ్రీనివాసరావు దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరి తలలకు తీవ్రగాయాలు కాగా.. వారిని హైదరాబాద్ తరలించారు.
News February 15, 2025
కంచిలి: గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

కంచిలి మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం సాయంత్రం కంచిలి ఎస్సై పారినాయుడు పట్టుకున్నారు. వీరి నుంచి 2 కేజీల గంజాయి, 2 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం సుర్లా నుంచి తరలిస్తుండగా ముగ్గురిని పట్టుకున్నామని తెలిపారు. వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
News February 15, 2025
పెబ్బేరు: షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రికల్ షాప్ దగ్ధం

పెబ్బేరు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ షాప్ అగ్నికి ఆహుతి అయింది. షాప్ యజమాని గౌని యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. షాప్‌లో ప్లాస్టిక్, పీవీసీ సామన్లు మొత్తం కాలిపోయాయని నష్టం భారీ ఎత్తున ఉందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.