News March 28, 2025
NGKL: అనాథ బాలికల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాత్సల్య అనాధ బాలికల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సబిత గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనాథ వసతిగృహంలో గదులను పరిశీలించారు. అందులో నివసిస్తున్న బాలికలకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. డోనర్స్ అందించిన వస్తువులను బాలికలకు అందించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాష్ రూమ్‌లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Similar News
News December 4, 2025
స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 41వ బోర్డు సమావేశంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్మన్, కలెక్టర్ డా. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ఎండి, కమిషనర్ ఎన్. మౌర్య సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇతర పెండింగ్ పనుల పురోగతిని వివరించారు. స్మార్ట్ సిటీ నిధుల మంజూరుపై ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ సూచించారు.
News December 4, 2025
నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్ప్రైజెస్ నమోదు..!

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్‌కు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్ ప్రైజెస్ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.
News December 4, 2025
గజ్వేల్: ‘అట్రాసిటీ కేసుల పట్ల నిర్లక్ష్యం వీడాలి’

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పట్ల పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. గజ్వేల్ అంబేద్కర్ భవన్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితుల, సాక్షుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించాలని కోరారు.


