News April 14, 2025
NGKL: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

బల్మూర్ మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. కొండనాగులకు చెందిన శ్రీను(50) భార్య ఊషమ్మ మూడు నెలల నుంచి తల్లిగారి ఊర్లో ఉంటోంది. శ్రీను కుమారుడితో కలిసి ఉంటున్నాడు. అతడు ఆదివారం ఉదయం ఎంతకూ నిద్రలేవకపోవటంతో స్థానికులు భార్యకు సమాచారమిచ్చారు. ఆమె వచ్చి చూడగా రక్తపుగాయాలతో శ్రీను మృతిచెంది కనిపించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 9, 2025
ఈ టైమ్లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it
News December 9, 2025
పౌష్టిక ఆహారంపై యాప్ ద్వారా పర్యవేక్షణ: పీవో

ఉమ్మడి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఐటీడీఏ పల్స్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని ఇన్ఛార్జ్ పీవో యువరాజ్ తెలిపారు. విద్యార్థులకు కామన్ డైట్ మెనూ సక్రమంగా అమలు చేయడాన్ని పర్యవేక్షించేందుకు ఈ యాప్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు యాప్ సమర్థంగా వినియోగిస్తూ ఫొటోలు, వివరాలు అప్లోడ్ అవుతున్నాయన్నారు.
News December 9, 2025
పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా రామారావు

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.వి.జి. రామారావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారి కోన శశిధర్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, పల్నాడు జిల్లా డీఈఓగా పనిచేస్తున్న చంద్రకళను కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేశారు.


