News February 12, 2025

NGKL: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.

Similar News

News November 27, 2025

TTD మాజీ AVSO కుటుంబానికి స్నేహితుల అండ

image

ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన TTD మాజీ AVSO వై.సతీశ్ కుమార్ కుటుంబానికి ఆయన స్నేహితులు(2012 బ్యాచ్‌మేట్స్) అండగా నిలిచారు. ఈనెల 15న పరకామణి కేసు విచారణకు వెళ్తూ సతీష్ రైలు పట్టాలపై శవంగా కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కర్మక్రియలకు హాజరైన AP, తెలంగాణలకు చెందిన బ్యాచ్‌మేట్స్ సతీష్ తల్లి పేరిట రూ.3 లక్షలు, పిల్లల పేరిట రూ.11 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.

News November 27, 2025

పంచాయతీ ఎన్నికలు.. పాలమూరులో ఉత్కంఠ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ, తిమ్మనోనిపల్లిలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను కోర్టు నేడు విచారించనుంది.

News November 27, 2025

అమరావతిలో రూ.1,328 కోట్ల పెట్టుబడులు.. 6,541 ఉద్యోగాలు

image

ఈ నెల 28న అమరావతిలోని సీఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయ పనులకు శంకుస్థాపన జరగనుంది. 15 బ్యాంకుల ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,541 ఉద్యోగాల కల్పన అమరావతిలో జరగనుందని CRDA కమిషనర్ కె. కన్నబాబు IAS బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాబార్డ్, ఆప్కాబ్, ఎల్ఐసీ, NIACLతో పాటు 11 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో ఏర్పాటు కానున్నాయన్నారు.