News February 12, 2025

NGKL: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.

Similar News

News March 19, 2025

MBNR: పదేళ్లలో BRSది విధ్వంస పాలన: మంత్రి జూపల్లి

image

రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా అభివృద్ధికి దోహదం చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బడ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్ శక్తి ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయన్నారు.

News March 19, 2025

నిర్మల్ : పరీక్షలకు 367మంది విద్యార్థులు గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 367మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తo 6416మంది విద్యార్థులకు పరీక్షకు కేటాయించగా ఇందులో 6049 మంది విద్యార్థులు పరీక్ష  రాశారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

News March 19, 2025

వనపర్తి: రైతులకు ఏం చేశారో చెప్పండి: మాజీ మంత్రి

image

అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల పాలన పూర్తికాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 2050 నాటికి తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెసోళ్లు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. పదేళ్ల KCRపాలనలో తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు. 

error: Content is protected !!