News April 1, 2025

NGKL: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. హీనంగా ప్రవర్తించారు..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో శనివారం రాత్రి <<15944914>>యువతిపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారం<<>> చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మైకంలో 8 మంది వివాహితపై విచక్షణారహితంగా అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి పశువుల కంటే హీనంగా ప్రవర్తించారనే ప్రచారం సాగుతోంది. పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.

Similar News

News December 4, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓భద్రాచలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
✓ చండ్రుగొండ అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
✓ ఎన్నికల ప్రచారానికి అనుమతి తప్పనిసరి: మణుగూరు డీఎస్పీ
✓ కొత్తగూడెం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
✓ సైబర్ మోసానికి పాల్పడితే 1930కు కాల్ చేయండి: ఇల్లందు డీఎస్పీ
✓ కరకగూడెం: ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీ
✓ భద్రాచలం: తానా వేదికపై ఆదివాసి చిన్నారి ప్రతిభ
✓ ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

News December 4, 2025

NLG: ఏకగ్రీవ గ్రామాల్లోనూ నియమావళి అమలు: SEC

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాల్లో కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని తెలిపారు. గురువారం ఆమె కలెక్టర్లు, పరిశీలకులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోస్టల్ బ్యాలెట్, ఓటర్ స్లిప్పుల పంపిణీపై సమీక్షించారు. ఫారం-10 ప్రకారం ఫలితాల ప్రకటన, ఉపసర్పంచ్ ఎన్నిక నిబంధనల ప్రకారం జరగాలన్నారు.

News December 4, 2025

మెదక్: తొలి విడతలో 144 గ్రామాల్లో ఎన్నికలు

image

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 160 గ్రామ పంచాయతీల్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 1402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అవడంతో ఈరోజు ఉపసర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహించినట్లు వివరించారు. మిగిలిన 144 సర్పంచ్, 1072 వార్డులకు 11న ఎన్నికల నిర్వహిస్తున్నట్లు తెలిపారు