News April 1, 2025

NGKL: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. హీనంగా ప్రవర్తించారు..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో శనివారం రాత్రి <<15944914>>యువతిపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారం <<>>చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మైకంలో 8 మంది వివాహితపై విచక్షణారహితంగా అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి పశువుల కంటే హీనంగా ప్రవర్తించారనే ప్రచారం సాగుతోంది. పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.

Similar News

News April 24, 2025

నిర్మల్: వడదెబ్బతో యువకుడి మృతి

image

వడదెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్‌లో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని బ్రహ్మపురికి చెందిన మహ్మద్ బేగ్ కుమారుడైన సోఫీ బేగ్ వడదెబ్బ తగలడంతో రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ నిర్మల్ ఆసుపత్రిలో మృతిచెందారు. సోఫీ బేగ్ మూడ నెలల కిందటే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు.

News April 24, 2025

సూర్యాపేట: త్వరలో డీసీసీ అధ్యక్షుడి ప్రకటన

image

డీసీసీ అధ్యక్ష పదవుల లిస్ట్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడి రేసులో పటేల్ రమేష్ రెడ్డి, జ్ఞాన సుందర్, చకిలం రాజేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్యాపేట అధ్యక్షుడిగా చెవిటి వెంకన్న యాదవ్ ఉన్నారు. త్వరలోనే అధ్యక్షుడిని ఫైనల్ చేసి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

News April 24, 2025

రాజోలు: ‘విధి వెక్కిరించినా విజయం సాధించాడు’

image

రాజోలుకు చెందిన చెల్లుబోయిన బాబికి పుట్టుకతో రెండు చేతులు మోచేతి వరకు మాత్రమే ఉన్నాయి. అయినా అతని అంకుటిత దీక్ష, పట్టుదల ముందు అవి ఏమాత్రం అడ్డంకి కాలేదు. ప్రతిరోజు బాలుర జడ్పీహెచ్ స్కూల్‌కి వెళ్తూ బాబి పట్టుదలతో పదో తరగతి చదువుకున్నాడు. పరీక్ష రాసేందుకు హెల్పర్‌ను ఇస్తామని ఉపాధ్యాయులు చెప్పినా సున్నితంగా తిరస్కరించాడు. రెండు మోచేతులతో కలం పట్టి పరీక్ష రాసి మెరిశాడు.

error: Content is protected !!