News April 3, 2025

NGKL: అమ్మాయిలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా.. జాగ్రత్త..!

image

మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో షీ టీం పనిచేస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Similar News

News October 29, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, ఫైనాన్స్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC,ST,దివ్యాంగులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

News October 29, 2025

మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా?

image

మన ఇంట్లో వస్తువుల అమరిక మనపై శుభాశుభ ఫలితాలను చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా ఉండాలంటే.. వాడని, తుప్పు పట్టిన, ఆగిపోయిన గడియారం వంటి వస్తువులను వెంటనే తీసివేయాలని అంటున్నారు. ‘కిటికీలు, తలుపులపై సెలనైట్ రాళ్లు ఉంచడం శుభం. గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఆర్థిక సమస్యలు రావొచ్చు. రోజూ అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది’ అంటున్నారు.

News October 29, 2025

వరంగల్‌: దారి తప్పిన గురూజీ.. గుణ‘పాఠం’ చెప్పేనా?

image

ఉమ్మడి వరంగల్‌లో విద్యార్థినులపై టీచర్ల లైంగిక వేధింపుల వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం క్రితం MHBD ప్రభుత్వ బడిలో జరిగిన ఘటన మరువక ముందే మంగళవారం మరో బడిలో ఈ ఘటన వెలుగు చూసింది. భూపాలపల్లిలోనూ ఓ బడిలో PET వేధించడంతో పేరెంట్స్ చితకబాదారు. దీంతో విద్యార్థినులు బడికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. అయినా, అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోట్లేదని, తగిన గుణపాఠం చెప్పాలని జిల్లా వాసులు కోరుతున్నారు.