News April 3, 2025
NGKL: అమ్మాయిలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా.. జాగ్రత్త..!

మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో షీ టీం పనిచేస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Similar News
News April 20, 2025
ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.
News April 20, 2025
డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడదాం: చిరంజీవి

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టీవర్క్స్‌లో జరిగిన నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరం చేయిచేయీ కలుపుదాం. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా శ్రమించాలి. వ్యసనాలకు బానిసలై తమ కలలను దూరం చేసుకుంటున్న యువతను రక్షిద్దాం’ అని ఆయన పేర్కొన్నారు.
News April 20, 2025
సిర్పూర్ (యు): అనాథలుగా మారిన చిన్నారులు

ఇద్దరు చిన్నారుల జీవితాలను విధి అంధకారంలోకి నెట్టింది. తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథలుగా మార్చింది. రాగాపూర్‌కి చెందిన సోయం హన్మంతు 2 రోజుల క్రితం వడ దెబ్బతో మృతి చెందగా అతడి భార్య లక్ష్మీ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో వారి కుమార్తె జంగుబాయి(10), కుమారుడు చంద్రబాన్ (9) అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న NHRC సభ్యులు శనివారం వారి ఇంటికి వెళ్లి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.