News March 16, 2025
NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.
Similar News
News April 19, 2026
ఇల్లందు: మృత్యుంజయుడు.. పసిబిడ్డకు పునర్జన్మ!

ఇల్లందు ఏరియా ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. శ్వాస, గుండె స్పందన నిలిచిపోయి క్లిష్ట స్థితిలో వచ్చిన మూడు నెలల బాలుడికి ప్రాణం పోశారు. డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ బృందం అప్రమత్తమై మూడు విడతలుగా సీపీఆర్ నిర్వహించి, అడ్రినలిన్ డోసులు అందించారు. వైద్యుల అలుపెరుగని పోరాటంతో పసివాడి గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అనంతరం చిన్నారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
News April 19, 2026
PGRS సమయాల్లో మార్పు: నంద్యాల కలెక్టర్

వేసవి దృష్ట్యా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమయాన్ని మార్చినట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఇవ్వచ్చన్నారు.
News April 19, 2026
వేసవి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదివారం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. వడదెబ్బ నివారణకు కాటన్ దుస్తులు ధరించాలని, దాహం లేకపోయినా తరచుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు.


