News January 20, 2025
NGKL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్

బిజినేపల్లి మండల కేంద్రంలోనీ తాహశీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా సర్వే వివరాలను తహశీల్దార్ శ్రీరాములును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప, ఏవో నీతీ, ఎంపీఓ నరసింహులు, మండల ఏఈవోలు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
MBNR: చెస్ ఎంపికలకు 250 మంది క్రీడాకారుల హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
News November 12, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్ 14.3, మిడ్జిల్ 14.5, రాజాపూర్ 14.6, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 12, 2025
MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.


