News April 9, 2025
NGKL: ‘ఆదాయ అభివృద్ధికై వ్యవసాయ పరిశోధనలు సాగాలి’

బిజినేపల్లి మండల పరిధి పాలెంలో ప్రొ.జయశంకర్ దక్షిణ తెలంగాణ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఆడిటోరియంలో వ్యవసాయ విస్తరణ, సలహా సంఘ సమావేశానికి కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రాబోయే వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా పరిశోధనలు ఉండాలన్నారు. రైతులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి వ్యవసాయం చేయాలని సూచించారు.
Similar News
News October 20, 2025
ప్రమాదరహితంగా పండుగ జరుపుకోండి: కామారెడ్డి SP

కామారెడ్డి జిల్లా ప్రజలకు SP రాజేష్ చంద్ర దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రమాదరహితంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. బాణాసంచా కాల్చే సమయంలో అగ్నిప్రమాదాలు, గాయాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. పర్యావరణహిత టపాకాయలు మాత్రమే ఉపయోగించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలోనే టపారకాయలు కాల్చాలన్నారు. అత్యవసరమైతే 101ను సంప్రదించాలని సూచించారు.
News October 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 20, 2025
అనకాపల్లి: ఈనెల 20 నుంచి 23 వరకు వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం తెలిపారు. ఈ మేరకు రైతులు వ్యవసాయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల క్రింద నిలబడకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనవసరంగా బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు.