News March 22, 2025
NGKL: ఆ పథకం దరఖాస్తుకు ఈనెల 31 లాస్ట్!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 31 చివరి తేదీ జిల్లా అధికారి షాబుద్దీన్ తెలిపారు. 21-24 వయసు, పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, బ్యాచిలర్ డిగ్రీ పూర్తయి ఉన్న వారు అర్హులు. నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థుల ఖాతాలో నేరుగా జమ చేస్తారని తెలిపారు.
Similar News
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.
News April 20, 2025
భూ భారతితో రైతులకు సత్వర నాయం: కలెక్టర్ క్రాంతి

భూ భారతి చట్టంతో రైతులకు సత్వర న్యాయం అందుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పుల్కల్‌లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తారని చెప్పారు. చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకే మండలాల వారిగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు పాల్గొన్నారు.
News April 20, 2025
పారదర్శకంగా భూభారతి చట్టం: మహబూబాబాద్ కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి- 2025 చట్టాన్ని జిల్లాలో పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. ఈ మేరకు చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గత భూ చట్టాల కంటే భిన్నంగా రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.