News February 28, 2025
NGKL: ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. గురువారం నాగర్కర్నూల్ కలెక్టరేట్లో మాట్లాడుతూ.. పరీక్షలలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,477, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,977 మంది హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News October 29, 2025
MNCL: మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేపట్టాలి

అమృత్ 2.0 పథకం కింద IGS ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందు కోసం అవసరమైన వివరాలు సంబంధిత శాఖల అధికారులు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మందమర్రి మున్సిపల్ అధికారులకు మొదటి అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగరం ప్రస్తుత స్థితి, 20ఏళ్ల భవిష్యత్ అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలన్నారు.
News October 29, 2025
లొంగిపోయిన మావోయిస్టులకు రూ.9.50 లక్షల రివార్డు

భద్రాద్రి: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు సభ్యులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రివార్డును ఎస్పీ రోహిత్ రాజు బుధవారం అందజేశారు. ఈ ముగ్గురు సభ్యులకు ఆయన రూ.9.50 లక్షల నగదును చెక్కుల రూపంలో అందించారు. రివార్డులు అందుకున్న వారిలో రామ్ సింగ్ కౌడే, ముచ్చికి సోందాల్, సోడి భీమే ఉన్నారు.
News October 29, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: KNR కలెక్టర్

తుఫాన్ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30న వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.


