News October 20, 2024

NGKL: ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలం పరిశీలన

image

నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి సంబంధించిన స్థలాన్ని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, తదితరులు ఆదివారం పరిశీలించారు. పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి అన్ని రంగులతో భవనాన్ని నిర్మాణం చేపట్టనున్నట్లు మల్లు రవి తెలిపారు.

Similar News

News November 8, 2024

PUలో ఖో-ఖో క్రీడాకారుల ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో ఖో-ఖో స్త్రీ, పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌత్ జోన్(ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్)లో పాల్గొనేందుకు శుక్రవారం ఎంపికలు చేసినట్లు యూనివర్సిటి పీడీ వై.శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు తమిళనాడు, కాలికట్ యూనివర్సిటీలో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కృష్ణయ్య, బాల్రాజ్, రవీందర్, సత్య భాస్కర్ రెడ్డి, మీనా తదితరులు పాల్గొన్నారు.

News November 8, 2024

అలంపూర్ టూ శ్రీశైలం సైకిల్ యాత్ర

image

కార్తీకమాసం సందర్భంగా అలంపూర్ పట్టణ యువకులు ఈరోజు శుక్రవారం 100 మందితో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం నుంచి శ్రీశైలం సైకిల్ యాత్రగా వెళ్లారు. ప్రతి సంవత్సరం సైకిల్ యాత్ర కమిటీ వేసుకుని అన్నదానం కోసం కూడా సైకిల్ లక్కీ లాటరీ ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 15 సంవత్సరాలుగా జరుగుతుందని నిర్వాహకులు ప్రశాంత్, భూపాల్, సుధాకర్, శీను అంజి తదితరులు తెలిపారు.

News November 8, 2024

రేవంత్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగి.. సీఎం దాకా !

image

8 నవంబర్ 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా ఎగిది నేడు సీఎం అయ్యారు.  2006లో ZPTCగా, 2007 MLCగా, 2019లో మల్కాగిజిరి ఎంపీగా, 2009, 2014, 2023 నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 7 జూలై 2021–6 సెప్టెంబర్ 2024 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 7 డిసెంబర్ 2023న తెలంగాణ 2వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.