News February 15, 2025

NGKL: ఈ నెల 19వ తేదీ నుంచి 24 గంటలూ అనుమతి

image

నాగర్ కర్నూల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టులో 24 గంటలూ అనుమతి ఉంటుందని శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో ప్రయాణికులను, వాహనాలను అనుమతించరు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News October 16, 2025

అమరావతి: 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం

image

అమరావతి భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా 40.25 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కమిషనర్ కె. కన్నబాబు చర్చలు ఫలించాయి. ఉండవల్లిలో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు, ఇతర రోడ్ల నిర్మాణ పనుల కోసం 22 మంది రైతులు 12 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారు. పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు.

News October 16, 2025

50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…

image

TG: సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించరాదని తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లుండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50%లోనే సీట్లు కేటాయించాలి. ప్రస్తుతమున్న12769 పంచాయతీల్లో 6384, MPTC 5745లో 2872, MPP 566లో 283, ZPP 32లో 16 రిజర్వేషన్ల కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లలోనే SC, ST, BCలకు సీట్లు రిజర్వు చేయాలి. దీనికి మించి ఉండాలంటే పార్టీ పరంగా ఇవ్వాలి.

News October 16, 2025

జగిత్యాల వైద్య కళాశాల సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల సిబ్బందికి సీపీఆర్‌పై వైద్య కళాశాల వైద్యులు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సీపీఆర్ చేయడం వలన మానవ శరీరంలో జరిగే మార్పులను వివరించారు. గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడిన వారు అవుతారని అన్నారు. కళాశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.