News February 10, 2025

NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

image

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 26, 2026

సంగారెడ్డి: మీ ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేలా RTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డిలోని కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ గురువారం ఆవిష్కరించారు. భక్తులు రూ.150 చెల్లించి సమీపంలోని ఆర్టీసీ కార్గో, లేదా www.tgslogistics.co.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 26, 2026

ఆదిలాబాద్‌లో SSC విద్యార్థులకు గ్రాండ్ ప్రాక్టీస్ టెస్టులు

image

ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి విద్యార్థుల కోసం గ్రాండ్ టెస్టుల షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 2 నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ప్రత్యేక తేదీలను కేటాయించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మరింత మెరుగ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

News February 26, 2026

జమ్మికుంట: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,550 పలుకగా.. గురువారం రూ.50 పెరిగి రూ.7,600 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు రైతులు 25 వాహనాల్లో 206 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.