News October 19, 2024
NGKL: ‘ఎక్కడైనా వేధింపులకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి’

ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అడిషనల్ SP సీహెచ్ రామేశ్వర్ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మహిళల రక్షణ, యాంటీ ర్యాగింగ్ పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు ఇబ్బందులకు గురైన సమయంలో పోలీసులతోపాటు షీ టీం సభ్యులను సంప్రదిస్తే వారు మీ వివరాలను గోప్యంగా ఉంచి సమస్య పరిష్కరిస్తారని అన్నారు. సమావేశంలో SI రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 21, 2025
MBNR: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో MBNR జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచినట్లు పేర్కొన్నారు. “వేడుకలు జరుపుకోవడం అందరి హక్కే.. కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు” అని ఆమె స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 21, 2025
MBNR: అన్నదాతల ఖాతాల్లోకి బోనస్ నిధులు..

MBNR జిల్లాలోని సన్న వరి సాగుదారులకు ఆర్థిక ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం బోనస్ కింద రూ.21.95 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 7,971 మంది రైతులు ఈ బోనస్కు అర్హత సాధించగా, డిఎం రవి నాయక్ వివరాలను వెల్లడించారు. ముందుగా 4000 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు చేరుతాయని, అనంతరం మిగిలిన రైతులకు జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
News December 21, 2025
MBNR: ఈనెల 22న ‘మాక్ డ్రిల్’: అదనపు కలెక్టర్

జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలతో MBNR జిల్లాలో 6 ప్రదేశాలలో ‘మాక్ డ్రిల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, మాక్ డ్రిల్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.


