News January 23, 2025
NGKL: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కొత్తపల్లి కుమార్

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడడం సరైనది కాదని బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొత్తపల్లి కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల తెలకపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటించిన సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 16, 2025
Fresh Low: మరింత పతనమైన రూపాయి

భారత రూపాయి విలువ మరోసారి చరిత్రలో కనిష్ఠ స్థాయికి చేరింది. మంగళవారం ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి రూ.90.83 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. సోమవారం 90.78 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు పెరిగిన డిమాండ్ రూపాయి బలహీనతకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
News December 16, 2025
ధర్మారం: సర్పంచ్‌గా బాలింత..!

ధర్మారం మండలం బుచ్చయ్యపల్లిలో నేరెళ్ల వంశిక 239 ఓట్లతో సర్పంచ్‌గా విజయం సాధించారు. 4 ఏళ్ల క్రితం ఈమెకు వివాహం కాగా, 11 రోజుల క్రితమే కుమార్తెకు జన్మనిచ్చారు. గ్రామస్థుల సూచనతో, కాంగ్రెస్ మద్దతుతో నామినేషన్ వేసిన వంశిక మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. 4 రోజుల క్రితం వరకు ఆసుపత్రిలో ఉన్న ఆమె, పోలింగ్ కేంద్రానికి వచ్చి ధ్రువీకరణ పత్రం స్వీకరించారు. గ్రామస్థులు వంశికకు అభినందనలు చెప్పారు.
News December 16, 2025
కేసీఆర్ మీటింగ్ వాయిదా

TG: ఈ నెల 19న KCR అధ్యక్షతన జరగాల్సిన BRSLP సమావేశం వాయిదా పడింది. ఈ మీటింగ్‌ను 21వ తేదీన నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 19న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో BRS MPలు కూడా ఈ భేటీలో పాల్గొనాలనే ఉద్దేశంతో వాయిదా వేశామని తెలిపారు. ఈ మీటింగ్‌లో కృష్ణా-గోదావరి నదులపై BRS సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చిస్తారని సమాచారం.


