News March 24, 2025

NGKL: ఎస్ఎల్బీసీ ఘటన.. సీఎం ఆదేశాలు

image

ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయకచర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐతో అధ్యయనం చేయించి, సొరంగంలో డ్రిల్, బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆ ఏడుగురికి పరిహారం చెల్లింపుపై ఓ నిర్ణయానికి రానున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని, తాత్కాలిక చర్యలే కాకుండా శాశ్వత చర్యలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News December 1, 2025

మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

News December 1, 2025

గద్వాల: ఎట్టకేలకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

image

గద్వాల మండలం కొత్తపల్లి నుంచి ఆత్మకూరు వరకు కృష్ణా నదిలో రూ.121 కోట్లతో హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు సోమవారం భూమి పూజ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.

News December 1, 2025

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రిమ్స్ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. హాస్టల్ ప్రాంగణం శుభ్రంగా ఉండే విధంగా చూడాలని సూచించారు.