News February 22, 2025

NGKL: ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులు వీరే..!

image

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14 కి. మీ. వద్ద కార్మికుల చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇందులో 43 మంది బయటికిరాగా.. ఏడుగురు లోపల చిక్కుకున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. గుర్బీత్ సింగ్ (PJ), సన్నీత్‌సింగ్ (JK), శ్రీనివాసులు (UP), మనోజ్ రూబెన (UP), సందీప్, సంతోష్, జట్కా హీరాన్ (JR). వీరి ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రులు, పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.    

Similar News

News January 3, 2026

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: సంగారెడ్డి ఎస్పీ

image

జిల్లాలో ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరితోష్ పంకజ్ హెచ్చరించారు. చైనా మాంజాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని చెప్పారు. దీనివల్ల ద్విచక్ర వాహనాదారులు, పాదాచారులు, పక్షులు గాయపడుతున్నారని చెప్పారు తెలిపారు. పతంగుల దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News January 3, 2026

గద్వాల: ఆన్‌లైన్‌లో మున్సిపల్ ఓటర్ల జాబితా

image

గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల ఓటర్లు తమ వార్డు వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చని కలెక్టర్ సంతోష్ శనివారం తెలిపారు. ఓటర్లు https://urban2025.tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ ఓటు ఏ మున్సిపాలిటీ, ఏ వార్డుకు మ్యాప్ అయిందో సులభంగా చూసుకోవచ్చని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా సమాచారాన్ని తక్షణమే పొందేందుకు ఈ వెబ్ పోర్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు.

News January 3, 2026

జీర్ణశక్తిని పెంచే ఫ్రూట్స్ ఇవే..

image

శీతాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఫైబర్, ఎంజైమ్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. నారింజ, కివి, దానిమ్మ, బొప్పాయి, జామపండు శీతాకాలంలో ఎక్కువగా తినాలి. ఇవి మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం తగ్గించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే గ్రేప్‌ ఫ్రూట్‌, బెర్రీలు, బెర్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శీతాకాలంలో బరువు పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు నిపుణులు.