News March 18, 2025

NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

image

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News November 6, 2025

పీయూకి నేడు మందకృష్ణ మాదిగ రాక

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడులకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 17న నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.

News November 6, 2025

నేడు పాలమూరులో అభినందన బైక్ ర్యాలీ

image

పాలమూరుకు యూజీడీ కోసం రూ.821 కోట్లు, తాగునీటి పైప్‌లైన్ కోసం రూ.221 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం ఉదయం 10:30 గంటలకు అభినందన బైక్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ క్యాంపు కార్యాలయం శ్రీనివాస్ కాలనీ నుంచి క్లాక్ టవర్ వరకు సాగుతుందని డీసీసీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ సిరాజ్ ఖాద్రి తెలిపారు.

News November 5, 2025

నవాబుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్‌నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.