News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News December 24, 2025
GNT: రైల్వే లైన్ భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల

నంబూరు – ఎర్రుపాలెం వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ కోసం మరో 300 ఎకరాలు భూ సేకరణ కోసం రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. NTR జిల్లాలోని 8 గ్రామాల్లో భూ సేకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా భూ సేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటే నష్టపోతామని ఇప్పటికే తాడికొండ రైతులు అభ్యంతరం తెలిపారు. భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. 2024 డిసెంబర్ 21న ప్రకటన ఇచ్చారు.
News December 24, 2025
తిరుపతి: యూనివర్సిటీలో మళ్లీ ర్యాగింగ్.!

SVUలో ర్యాగింగ్ ఘటన మరవకముందే SVవెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై ర్యాగింగ్ చేయడంతో అతని తండ్రి SP ఆఫీసులో ఫిర్యాదు చేశారు. వర్సిటీ సిబ్బంది ఐదుమంది సీనియర్స్ను 3నెలల హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన అనంతరం ఓ హాస్టల్ విద్యార్థిపై డేస్ స్కాలర్ విద్యార్థి బయట వ్యక్తులతో దాడి చేయగా.. వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
News December 24, 2025
ప.గో: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి.. UPDATE

పెనుమంట్ర మండలం పొలమూరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం స్పందించారు. ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన ఘటనపై పోలీసు, రవాణా, ఆర్అండ్బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరపాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి త్వరగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.


