News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News April 18, 2025
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నివేదిక అందించాలి: కలెక్టర్

అకాల వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ, వాణిజ్య పంటల నివేదిక అందజేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నివేదిక రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం అంచనాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా నమోదు చేయాలన్నారు.
News April 18, 2025
ఖమ్మం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఖమ్మం జిల్లాకు ఖమ్మం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఖమ్మం నగర మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచి మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలించేవారని చరిత్ర చెబుతుంది. ఉర్దూ భాషలో ఖమ్మం అంటే స్తంభం అని అర్ధం. అలాగే నరసింహస్వామి పేరు మీద ఈ పేరు వచ్చిందనే వాదన ఉంది. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రాంతాన్ని ‘ఖమ్మం మెట్టు’ అని పిలిచేవారనే మరో వాదన ఉంది. దీంతో ఖమ్మంకు అలా పేరు వచ్చిందని చెబుతున్నారు.
News April 18, 2025
భద్రాద్రి కొత్తగూడెంకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఊరును గూడెంగా పిలుస్తారు. కొత్తగా ఏర్పడిన గూడెం కొత్తగూడెంగా మారింది. కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం.. ఇక్కడ సింగరేణి హెడ్ ఆఫీస్ ఉండడం వల్ల దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణంగానూ పిలుస్తారు. అలాగే భద్రాచలం రామాలయం పేరు భద్రాద్రిగా మారింది. నూతనంగా ఏర్పడిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెంగా అవతరించింది.