News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో గత నెల 14వ తేదీన బాలికిపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News February 26, 2026
జగిత్యాల: ఈనెల 28న ఎంప్లాయ్మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్ మేళా

జగిత్యాలలో ఈ నెల 28న ఎంప్లాయ్మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. జిల్లాలోని 14 – 54 సంవత్సరాల వయస్సు వారు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
News February 26, 2026
బంధాలకు మిడ్‌లైఫ్ క్రైసిస్ ముప్పు

40 దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత దంపతుల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా, మరి కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News February 26, 2026
లెక్క తేల్చేందుకు కసరత్తు.. ముహూర్తం ఫిక్స్!

తూ.గో జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ గురువారం తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.


