News March 15, 2025

NGKL: ఒంటిపూట బడులు.. ఒక్కో క్లాస్ ఎంతసేపంటే..?

image

నేటి నుంచి ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్‌. SHARE IT

Similar News

News December 22, 2025

వాట్సాప్‌లో ఫొటోలు డౌన్‌లోడ్ చేస్తే అంతే!

image

UP లక్నోకు చెందిన ప్రశాంత్ వర్మ వాట్సాప్‌లో వచ్చిన ఫొటోను డౌన్‌లోడ్ చేసి రూ.4.44 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడని, అతని జేబులో మీ గుర్తింపు కార్డు ఉందని కేటుగాళ్లు ఫోన్ చేసి నమ్మించారు. అతని ఫొటోను వాట్సాప్‌లో పంపించగా.. డౌన్‌లోడ్ చేయగానే ఫోన్‌లో APK ఫైల్ ఇన్‌స్టాల్ అయి నగదు మాయమైంది. అపరిచిత వ్యక్తులు పంపే ఫొటోలు, ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News December 22, 2025

RSSను పటేల్ బ్యాన్ చేశారు: జైరాం రమేశ్

image

<<18632147>>RSSపై<<>> కాంగ్రెస్ MP జైరాం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్దార్ పటేల్ RSSను నిషేధించారన్నారు. ‘రహస్య సంస్థలా కాకుండా పారదర్శకంగా పనిచేయాలంటూ గురు గోల్వాల్కర్‌కు పటేల్ లేఖ రాశారు’ అని తెలిపారు. నాగ్‌పూర్ కేంద్రంలో దశాబ్దాల పాటు జాతీయ జెండా ఎగరవేయకపోవడం, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత అంబేడ్కర్, పటేల్, నెహ్రూ, గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆ సంస్థ సిద్ధాంతాన్ని ప్రశ్నించారు.

News December 22, 2025

మంగళగిరిలో బాలికపై గ్యాంగ్‌రేప్.. లోకేశ్ స్పందించరా: వైసీపీ

image

AP: మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో బాలిక(13)పై గ్యాంగ్ రేప్ జరిగిందని YCP ట్వీట్ చేసింది. ఈ ఘటనపై లోకేశ్ సైలెంట్‌గా ఉన్నారని ఆరోపించింది. ‘తన సొంత నియోజకవర్గంలో ఇంత భయంకరమైన నేరం జరిగితే లోకేశ్ స్పందించకపోవడం మహిళల భద్రత విషయంలో ఆయన ఉదాసీనతను సూచిస్తోంది. రాజకీయ నిర్లక్ష్యం వల్ల శాంతిభద్రతలు దెబ్బతినకూడదు’ అని పేర్కొంది. బాధితురాలకి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.