News March 15, 2025
NGKL: ఒంటిపూట బడులు.. ఒక్కో క్లాస్ ఎంతసేపంటే..?

నేటి నుంచి ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్. SHARE IT
Similar News
News April 20, 2025
పోతంగల్: కొడుకు పెళ్లి.. తండ్రి మృతి

తెల్లవారితే కొడుకు పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. రుద్రూర్‌కు చెందిన నాగయ్య(52) తన కొడుకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే శనివారం పోతంగల్‌లోని కారేగాంకు బైక్ పై వెళుతుండగా హంగర్గ ఫారం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు. అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
News April 20, 2025
తాడూర్: స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. కరెంట్ బంద్

కరెంట్ స్తంభాన్ని లారీ ఢీ కొట్టిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం యాదిరెడ్డిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గుంతకోడూర్‌కి చెందిన లారీ డ్రైవర్ రాములు యాదిరెడ్డిపల్లి కోళ్ల ఎరువు అన్లోడ్ చేసి వస్తున్నాడు. ఈ క్రమంలో మూలమలుపు వద్ద ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.
News April 20, 2025
తాడిపత్రి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని యువకుడు నరసింహ (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తాడిపత్రిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. నరసింహ ఇంజినీరింగ్ చదివాడు. ఉద్యోగం కోసం పలు కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.