News October 29, 2024
NGKL: ఒకే గ్రామంలో ముగ్గురికి జూనియర్ లెక్చరర్ జాబ్స్

వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన ముగ్గురు TGPSC జూనియర్ లెక్చరర్(JL) జాబ్స్ కొట్టి ఔరా అనిపించారు. కల్వరాల గ్రామానికి చెందిన హిమబిందు (కామర్స్ ), రాముడు(కెమిస్ట్రీ), భరత్ (హిస్టరీ) JLగా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన ముగ్గురికి ఒకేసారి ఉద్యోగాలు రావడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు కుటుంబీకులు హర్షం వ్వక్తం చేస్తున్నారు. వారిని స్థానికులు అభినందించారు.
Similar News
News November 19, 2025
MBNR: U-19 క్రికెట్.. రిపోర్ట్ చేయండి

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల బాలికలకు క్రికెట్ జట్ల ఎంపికలను జడ్చర్లలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ మోసీన్కు ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.