News February 6, 2025

NGKL: కడుపునొప్పి భరించలేక.. వ్యక్తి బలవన్మరణం

image

తీవ్రమైన కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన గంగనమోని భాగయ్య(58) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నొప్పి భరించలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

Similar News

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. పార్థసారథికి 23వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ఏలూరు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి 23వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

News February 6, 2025

బాపట్ల జిల్లా మంత్రులకు CM ర్యాంకులు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌‌ 13వ ర్యాంక్, అనగాని సత్యప్రసాద్‌ 21 ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని CM సూచించారు.

News February 6, 2025

మంత్రి స్వామికి 5వ ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప్రకాశం జిల్లా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి 5వ ర్యాంక్, బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ 13వ ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాని CM సూచించారు.

error: Content is protected !!